మెగా ’మనం’
’మనం’ మూడు తరాల అక్కినేని ఫ్యామిలీ నటించిన చిత్రం. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మనం రిలీజ్ కు ముందే టాలీవుడ్ లో మరో శుభవార్త చెక్కర్లు కొడుతోంది. అదే.. మెగా ’మనం’. మెగా ఫ్యామిలీ నుండి కూడా మరో ’మనం’లాంటి సినిమా రానుందట. ఇందుకు చిరు 150వ సినిమా వేదిక కానున్నట్లు టాలీవుడ్ సమాచారమ్. తాజాగా, చిరు తన 150వ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని నిన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సాక్షిగా ధృవీకరించారు. మణిరత్నం దర్శకుడు. గతంలో కమలహాసన్ నటించిన ‘నాయకుడు’ సినిమా తరహాలో ఈ చిత్రం వుండనుందని టాక్. చిరు 150వ సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా నటిస్తారట. పవన్ వచ్చి చేరిన ఆశ్చర్యపోనక్కలేదట. సో.. ఇది అక్కినేని ’మనం’ లాగా మూడు తరాల సినిమా కాలేకపోయినా.. మెగాఫ్యామలీ ఫ్యాక్ అని చెప్పవచ్చు. ఇదే నిజమైతే.. మెగా అభిమానులకు పండగే మరీ..
0 comments:
Post a Comment