పవన్ ‘ఇజం’ గురించి దిల్ రాజు ఎందుకలా మాట్లాడారు?
. హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నేపథ్యంలో సినిమా రంగంలోని ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. పవనిజం కాన్సెప్టును కొందరు మెచ్చుకున్నారు కూడా. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం ‘పవనిజం' గురించి భిన్నంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెబుతున్న ‘ఇజం' ఆచరణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. దిల్ రాజు ఇలా మాట్లాడటం వెనక అనేక కారణాలు వనిపిస్తున్నాయి. గతంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. పవన్ రాజకీయాల బాట పట్టిన నేపథ్యంలో ఇకపై సాధ్యం అవుతుందనే నమ్మకం కూడా లేదు. సో ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదుకాబట్టి దిల్ రాజు తన మనసులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారని తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో టాప్ నిర్మాత అయిన ఆయన....తన భవిష్యత్ దృష్ట్యా విభజన కోసం పోరాడిన కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ‘ఇజం'ను ఆయన ఆచరణ సాధ్యంకాని సిద్దాంతంగా పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దిల్ రాజు సినిమాల విషయానికొస్తే...ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘ఎవడు' చిత్రం విడుదలై భాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నిర్మాణంలో పెద్ద ప్రాజెక్టులేవీ ఓకే కాలేదు. ప్రస్తుతం ఆయన సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ‘కేరింత' అనే స్మాల్ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
Read more at: http://telugu.oneindia.in/movies/news/pawan-ism-impossible-dil-raju-133664.html
0 comments:
Post a Comment